‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిధిగా విక్టరీ..! ఈ రోజే

0
103
venkatesh chief guest for jersy pre release event

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నాని హీరోగా, నాని సరసన శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగానున్నాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనుండగా.. సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ పెంచేశారు చిత్ర యూనిట్ వారు. ఈ సినిమా ప్రీ రిలేజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదిక లో జరుగుతుంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధి గా వస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన మజిలీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా  వెంకీమామ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా 50 కోట్ల క్లబ్ చేసింది. వెంకీ చేతుల మీదుగా ఈ వేడుక జరుగుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అంతే రేంజ్ లో దూసుకెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ వేడుక సాయంత్రం 7:30 నిమిషాలకు శిల్పకళా వేదిక లో మొదలు కానుంది. సినిమాలో నాని ఒక క్రికెటర్ గా కనిపించనున్నాడు.

Jersy pre release event at shilpakala vedika