వైసీపీ, జ‌న‌సేన పొత్తుపై నాదెండ్ల‌ క్లారిటీ..!

0
49

ఏపీ వ్యాప్తంగా అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌తిన‌క్ష ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జ‌న‌సేన పొత్తు ఉంటుందా..? పొత్తు ఉంటే ఏఏ స్థానాల్లో మీరు పోటీ చేసే అవ‌కాశం ఉంది..? మెజార్టీ స్థానాలు జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని వైసీపీని కోరే ఉద్దేశం ఉందా..? అస‌లు జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల క‌ల‌యిక ఎప్పుడు అంటూ శుక్ర‌వారం నాడు జ‌న‌సేన ముఖ్య‌నేత, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై విలేక‌రులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అయితే, ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ల మేర‌కు ఆ పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌న‌త‌రంగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఆ పార్టీ ముఖ్య‌నేత నాదెండ్ల మ‌నోహ‌ర్‌ కూడా ప్ర‌స్తుతం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న జ‌న‌సేన శ్రేణుల‌తో ఆయ‌న ఇవాళ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంలోనే విలేకర్లు ఆయ‌న‌పై పై విధంగా ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపించారు.

కాగా, విలేకరుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మాధానం ఇస్తూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏ పార్టీతోనూ జ‌న‌సేన పొత్తు పెట్టుకోద‌ని క్లారిటీ ఇచ్చారు. అటువంటి చ‌ర్చ త‌మ పార్టీ స‌మావేశాల్లో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, అధికారంలో ఉన్న టీడీపీ, ప్ర‌తిపక్షంలో ఉన్న వైసీపీ ఈ రెండు పార్టీల సోష‌ల్ మీడియా బృందాలు త‌మ పార్టీపై లేనిపోని విష ప్ర‌చారం చేస్తున్నాయ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా, గ‌త రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌, మెగాస్టార్ చిరంజీవి క‌లిసి ఆలింగనం చేసుకుంటున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ, ఈ ఫోటో ఆధారంగా ఆ విలేక‌రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారేమో కాబోలు..!