విశాల్‌కు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ స్ట్రాంగ్ డోస్‌

0
476

టాలీ, కోలీవుడ్ల కంబైన్డ్ హీరో విశాల్‌కు సీనియర్ నటుడు శరత్ కుమార్ త‌న‌యి.. నటి వరలక్ష్మి స్టాంగ్ డోస్ ఇచ్చింది. 2019-2022కు గాను జరుగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల సందర్బంగా విశాల్ మరోసారి శరత్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. దీంతో వరలక్ష్మి.. పోటీలో లేని నా తండ్రిని అనవసరంగా ఎందుకు తిడుతున్నావ్ అంటూ విరుచుకుపడింది.

“ఎప్పుడూ చట్టం.. చట్టం అంటావ్ కదా.. ఆ చట్టం ప్రకారమే నేరం రుజువుకావివారు నిర్దోషులు. మా నాన్న తప్పు చేసి ఉంటే ఈపాటికి చట్టం చర్యలు తీసుకుని ఉండేది. అయినా ప్రస్తుత ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నా తండ్రిని ఎందుకు విమర్శిస్తున్నావ్. నీ పదవీ కాలంలో నువ్వు చేసిన మంచి పనులేవైనా ఉంటే వాటి గురించి చెప్పుకో. ప్రచారంలో చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్. ఇన్నిరోజులు ఒక స్నేహితురాలిగా నీకు మద్దతు ఇచ్చాను. ఇకపై నా సపోర్ట్ నీకు ఉండదు. నా ఓటును కోల్పోయావ్”

అంటూ పెద్ద లెట‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లోపెట్టి పెద్ద దుమారం రేపింది వ‌ర‌ల‌క్ష్మీశ‌ర‌త్ కుమార్‌.