ఆ హీరో కోసమే స్క్రిప్ట్ రెడీ చేస్తా ..! వంశీ పైడిపల్లి

0
219
vamshi paidipally

ప్రస్తుతం ఎక్కడ చూసిన అందరు ‘మహర్షి’ మూవీ గురించి, వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించే మాట్లాడుతున్నారు. స్టార్ హీరోలైన నందమూరి వారసుడు ఎన్టీఆర్ కి ‘బృందావనం’తో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ‘ఎవడు’తో.. ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుకి ‘మహర్షి’ తో భారీ హిట్ ని అందించాడు. కానీ తన మొదటి సినిమా హిట్ కొట్టలేదని.. ఆ హీరోకి మరో సినిమాతో తప్పకుండా హిట్ అందిస్తానని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ ఫిల్మ్ ‘మున్నా’ హీరో ప్రభాస్ తో 2007 సంవత్సరంలో తెరకెక్కిన సినిమా విజయాన్ని అందుకోలేక పోయింది. ఈ విషయమై వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ..” దాదాపుగా కొంతమంది హీరోలు వారికి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ ని పక్కకి పెడతారు లేదా తక్కువ భావం తో చూస్తారు. అలాంటిది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు అలా చూడలేదు. అప్పుడు, ఇప్పుడు ఆత్మీయంగా, గౌరవంగానే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల ప్రభాస్ కోసం మంచి స్క్రిప్ట్ ను రెడీ చేస్తాను. ఆయనను ఒప్పించి తప్పకుండా సూపర్ హిట్ అందిస్తాను.” అంటూ చెప్పుకొచ్చాడు.