దొంగ ఓట్లపై వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆందోళ‌న‌..!

0
231

కృష్ణా జిల్లాలో ఎన్నిక‌ల వేళ అక్క‌డ‌క్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని ప్ర‌సాదంపాడు పోలింగ్ కేంద్రం వ‌ద్ద గురువారం రాత్రి ఉద్రిక్త ప‌రిస్తితి నెల‌కొంది. అర్ధ‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌డంతో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆరోపించుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట‌కు దారి తీసింది. పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించారు. దీంతో చెన్నై, కోల్‌క‌తా ర‌హ‌దారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి వ‌ల్ల‌భ‌నేని వంశీ మాట్లాడుతూ ప్ర‌సాదంపాడు పోలింగ్ బూత్ చాలా చిన్న‌ద‌ని, 3వేల పైచిలుకు ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు క‌లిగి ఉన్నార‌ని, ఓట‌ర్ల కోసం క‌నీసం టెంట్లూ, తాగునీరు ఇలా ఎటువంటి సౌక‌ర్యం లేకుండా తీవ్ర ఎండ‌లోనూ బ‌య‌ట నిల‌బెట్టించార‌న్నారు. ఆ విష‌యాన్ని డీసీపీకి, ఆర్‌వో దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు వ‌ల్ల‌భ‌నేని వంశీ తెలిపారు.