స‌జీవ స‌మాధి అయిపోతా.. స‌హ‌క‌రించండి.!

0
183

సజీవ సమాధి అయిపోతా అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను కామాఖ్యధామంలో ఉంటున్నానని. తాను చేసిన శ‌ప‌థం నిలబెట్టుకునేందుకు జూన్‌ 16న మధ్యాహ్నం 2.11 గంటలకు సజీవ సమాధిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని వైరాగ్యానంద చెబుతున్నారు. స్థానిక యంత్రాగం త‌న‌కు సహకరిస్తుందని నమ్ముతున్నానని ఆయ‌న త‌న దరఖాస్తులో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దిగ్విజయ్‌ సింగ్‌ విజయం సాధిస్తారని వైరాగ్య‌ జోస్యం చెప్పారు. డిగ్గీరాజా గెలవకుంటే సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. అయితే, బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌ చేతిలో దిగ్విజయ్‌ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.

ఇలాఉండ‌గా, వైరాగ్య స‌జీవ స‌మాధికి అనుమతి ఇవ్వొద్దని తాను భోపాల్‌ డీఐజీకి లేఖ రాసినట్టు కలెక్టర్‌ తరుణ్‌కుమార్‌ పిథోడ్‌ తెలిపారు.