లాట‌రీ ప‌ద్ధ‌తిలో యూఎస్‌హెచ్‌1బీ వీసాలు..!

0
92

యూఎస్‌హెచ్1బీ వీసాల‌పై నిర్వ‌హించ‌నున్న లాట‌రీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేపుతోంది. గ‌త సంవ‌త్స‌రంక‌న్నా 10వేల అప్లికేష‌న్‌లు అధికంగా రావ‌డంతో ఈ సంవ‌త్స‌రం మొత్తం రెండు ల‌క్షలా వెయ్యి  హెచ్‌1బీ అప్లికేష‌న్‌లు అందాయి. అయితే ఈ వీసాపై భార‌తీయులే ఎక్కువ‌గా హోప్స్ పెట్టుకున్నారు.

అమెరికాలో భార‌త‌దేశానికి చెందిన ఐటీ కంపెనీలు స్థానిక అమెరిక‌న్‌ల‌క‌న్నా మ‌న‌దేశ‌స్థుల‌తోనే హెచ్‌1బీ వీసాకింద ప‌నిచేయించుకునేందుకు ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తున్నారు. దాంతో హెచ్‌1బీ వీసాలు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇదిలా ఉంటే గ‌డిచిన రెండేళ్ల‌లో హెచ్‌1బీ అప్లికేష‌న్‌ల సంఖ్య బాగా త‌గ్గిన‌ప్ప‌టికీ ఈ సంవ‌త్స‌రం మాత్రం భారీగా అప్లికేష‌న్‌లు రావ‌డం విశేషం.

మ‌రోవైపు ప్ర‌తీ ఏడాది కేవ‌లం 85వేల హెచ్‌1బీ వీసాలను మాత్ర‌మే అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీస్ జారీ చేస్తుంది. అందులోను జ‌న‌ర‌ల్ కోటా కింద 65వేల హెచ్‌1బీ వీసాల‌ను జారీ చేస్తాయి. అయితే మ‌రో 20వేల హెచ్‌1బీ వీసాల‌ను మాస్ట‌ర్ క్యాబ్ కింద ప‌రిగ‌ణిస్తుంటారు. ఈ క్యాట‌గిరీలో అమెరిక‌న్ యూనివ‌ర్సిటీలో గ్రాడ్యువేష‌న్ పూర్తిచేసిన వారికి ప్ర‌త్యేక కేటాయింపు ఇస్తుంటారు. కానీ, ఈ సంవ‌త్స‌రం మాత్రం భారీగా అప్లికేష‌న్‌లు రావ‌డంతో హెచ్‌1బీ వీసా అదృష్టం ఎవ‌ర్ని వ‌రించ‌నుందో తేలాల్సి ఉంది.