ఉప్పులేటి క‌ల్ప‌న : టీడీపీలో ఎందుకు చేరాల్సి వ‌చ్చిందంటే..!

0
239

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాజ‌ధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌డుతున్న క‌ష్టాన్ని, ప‌రిపాల‌న‌ద‌క్ష‌త‌ను, స‌మ‌ర్ధ‌త‌ను చూసి తాను గ‌తంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన‌ట్టు పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాడు చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీ అభివృద్ధిని సాధించింద‌న్నారు.

తాను వైసీపీలో ఉన్న స‌మ‌యంలో చంద్రబాబుపై విమ‌ర్శ‌లు చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, ప్ర‌త్యేక హోదా, రాజ‌ధాని నిర్మాణం, రైతుల భూములు, ద‌ళితుల స‌మ‌స్య‌లు, ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై తాను ప్ర‌శ్నించాన‌న్నారు. 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓట్లేసిన వారంతా అభివృద్ధి ప‌నుల నిమిత్తం నిధులు అడిగార‌ని, ఆ క్ర‌మంలోనే మేము మిమ్మ‌ల్ని అడుగుతున్నాం.. మీరు చంద్ర‌బాబును అడిగి నిధులు తెమ్మంటూ చెప్ప‌డంతో వారి అభీష్టం మేర‌కు తాను టీడీపీలో చేరాల్సి వ‌చ్చింద‌ని ఉప్పులేటి క‌ల్ప‌న చెప్పారు.