సల్మాన్ సీక్రెట్స్ బ‌య‌ట‌పెడ‌తా : ఉపాస‌న‌

0
102

స్టార్ హీరో వైఫ్ ఉపాసన కొణిదెల త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని నిల‌బెట్టుకుంటారు. అపోలో వ్యవ‌హారాలు కూడా చూసుకునే ఉపాస‌న మంచి వ్యాఖ్యాత కూడా. తాజాగా ఉప‌.. బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఈ ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ని ప్రశ్నలు అడిగిన ఉపాసన అతని రహస్యాలతో పాటు, సల్మాన్ లో ఉన్న మరో యాంగిల్ ని మీకు పరిచయం చేస్తానంటున్నారు. అపోలో స్టూడియోస్ లో చిత్రీకరించిన ఆ ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో ని ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘బి పాజిటివ్ విత్ ఉపాసన’ ఈ ప్రోగ్రామ్ టైటిల్.