YS జగన్ గెలుపును డిసైడ్ చేసేది పవన్ కళ్యానేనా..?

0
404
YS జగన్ గెలుపును డిసైడ్ చేసేది పవన్ కళ్యానేనా..?
YS జగన్ గెలుపును డిసైడ్ చేసేది పవన్ కళ్యానేనా..?

“YS జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలి అని ఉంది”.. ఉండవల్లి అరుణ్ కుమార్ భయిరంగంగా చెప్పిన మాట ఇది. అలా అని చంద్రబాబుగారు అంటే అతడికి కోపం లేదు, అలాఅని ద్వేషం కూడా లేదు. కేవలం చంద్రబాబు గారు ముందులా రాష్ట్రం కోసం ఆలోచించడం లేదని.. అడ్మినిస్టేటర్ గా అద్భుతంగా పనిచేసే బాబు ఇప్పుడు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అదే జగన్ అయితే యంగ్ పొలిటీషన్.. ఏదో చేస్తాను అంటున్నాడు కాబట్టి ఈసారి అతడికి ఒక అవకాశం ఇస్తే మంచిదని ఉండవల్లి ఎప్పటినుండో చెబుతున్నాడు.

కాగ ఉండవల్లి ఈమద్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో.. “YS జగన్ గెలుపును డిసైడ్ చేసేది పవన్ కళ్యానే” అనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆదినిజమే అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు కూడా. దాంతో నిజంగా జగన్ CM అవ్వాలంటే “పవన్ కళ్యాణ్” వేవ్ మీదే ఆధారపడి ఉందా ? అనే డిస్కర్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని జగన్ అభిమానులేమో “అంత సీన్ లేదు.. ఈసారి జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ ఆపలేరు” అంటుంటే.. పవన్ అభిమానులు మాత్రం “రిజల్ట్ వచ్చాకా చూడండి.. ఎవరి ప్రభావం ఎవరిమీద పడుతుందో” అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.

మరీ ఉండవల్లి ఎందుకు అలా అన్నారు ? నిజంగానే పవన్ ప్రభావం జగన్ గెలుపుమీదా పడుతుందా ? అంటే నిజమే అని ఒప్పుకోక తప్పదు.. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, TDP పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఆంధ్రపదేశ్ లో అత్యధికంగా శాతం ఉన్న కాపు ఓట్లు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి.. దానివల్లే జగన్ అత్యంత స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి సీటు చేజార్చుకున్నాడు. అదే కాపు ఓట్ల కారణంగా చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు.

దీన్నిబట్టి చూస్తే కాపు ఒట్లే గెలుపు, ఓటములను డిసైడ్ చేస్తుంది అని స్పష్టంగా అర్దం అవుతుంది. ఈసారి కాపు ఓట్లు TDPకి ఎలాగూ పడవు.. YCP పార్టీ, జగనసేన పార్టీలు ఈ కాపు ఓట్లను పంచుకోవాలి. ఇదే గనక జరిగితే “YS జగన్ మోహన్ రెడ్డి” గెలుపును ఎవ్వరూ ఆపలేరు.. అలా కాకుండా గత ఎన్నికల్లో జరిగినట్లుగా ఈసారి కూడా కాపు ఓట్లు గంపగుత్తగా జనసేన పార్టీకి పడితే మాత్రం అదికాస్తా మళ్ళీ TDP పార్టీకె అనుకూలంగా మారుతుంది. అదే గనక జరిగితే జగన్ కు మళ్ళీ కష్టాలు తప్పవు అంటూ చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం అలా జరగదు అని స్పష్టంగా అర్దం అవుతుంది. ఎందుకంటే గతంలో కాపులు పవన్ కళ్యాణ్ ను గుడ్డిగా నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారు.. తీరా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా చంద్రబాబు వాళ్ళని నిలువునా మోసం చేశాడు. కాపులకు జరిగిన అన్యాయాలను చూసికూడా “పవన్ కళ్యాణ్” 4 ఏళ్ళు సైలెంట్ గా ఉన్నాడు. చివరి నిమిషంలో “బాబుగారు నన్ను మోసం చేశాడు” అని TDP నుండి బయటకు వచ్చాడు.

అంతా మాత్రానా కాపులు “పవన్ కళ్యాణ్” ని ఎలా నమ్ముతారు ? అది ఆసాద్య.. కాబట్టి ఈసారి కాపులందరూ జగన్ వైపే ఉన్నారని YCP శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.. ఈమద్య వస్తున్న అనేక సర్వేలు కూడా జగన్ కె అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈసారి జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా ఆపేవాళ్లే లేరు అంటున్నారు YCP శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మరీ జగన్, చంద్రబాబు ఇద్దరిలో APకి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మే 23న తెలుస్తుంది.

                                                                                        ప్రమోద్ మోత్కుపల్లి