క‌ల‌క‌లం రేపుతున్న క్షుద్రపూజ‌లు..!

0
132

తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌లో అనాగ‌రిక మూడాచారాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి.పేట‌కు అరిష్టంప‌ట్టిందంటూ పేట పెద్ద‌లు అర్ధ‌రాత్రి క్షుత్ర‌పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంఘ‌ట‌న కాకినాడ సీతారాంన‌గ‌ర్‌లోని ఓ క‌మ్యూనిటీ హాల్లో పేట పెద్ద‌లు హాట్ బ‌య‌ట కాపలాకాస్తుండ‌గా.. హాల్ లోప‌ల మాత్రం ఎంతో గోప్యంగా ఈ తంతు జ‌రిగింది.

క్షుద్ర‌పూజ‌లు జ‌రుగుతున్నాయ‌ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేర‌కున్న పోలీసులు క‌మ్యూనిటీ హాల్లో ప‌సుపు, కుంకుమ, కోళ్ల‌తో పూజ‌లు చేస్తున్న తతంగాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. పూజ‌ల్లోపాల్గొన్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.