విజయవాడ నుంచి పోలీసులకు రవిప్రకాశ్‌, శివాజీ మెయిల్స్. !

0
184

ప్రముఖ న్యూస్ చానల్ టి‌వి9 కి సంబంధించి ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులు ఎదుర్కోంటోన్నఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌…సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మెయిల్‌ పంపించారు. కేసుల విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో పది రోజులు పాటు గడువు కావాలని ఆయన పోలీసు లకు పంపిన మెయిల్ లో కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్‌ సదరు మెయిల్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్‌ పంపించారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌, శివాజీ విచారణకు హాజరు కాలేదు. అయితే, రవిప్రకాశ్‌, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని పేర్కొంటూ కోర్ట్ తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది.