గులాబీకి ఎదురులేదు. టీఆర్ఎస్… లోకల్‌

0
38

పరిషత్ పోరులో చారిత్రాత్మక విజయం న‌మోదుచేసుకుంది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని గులాబీద‌ళం. అప్ర‌తిహ‌తంగా జైత్రయాత్ర కొన‌సాగించి – 449 జెడ్పీటీసీలు, 3571 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. టాప్ గేర్‌లో దూసుకుపోయిన‌ కారు జోరుకి ఆరు జిల్లా పరిషత్తుల్లో ప్రతిపక్షం కరువైంది. కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోసారి జై కొట్టారు.

టీఆర్ఎస్ దెబ్బ‌కి చిత్తుచిత్తయ్యాయి హస్తం, కమలం పార్టీలు. ఆయా పార్టీల‌కు బడానేతల ఇలాకాలోనూ పరాభవాలే ఎదురయ్యాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీ విజ‌య‌హాసంతో ఉన్న‌ప్ప‌టికీ ఓట‌రు మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ను చాటాడు. స్థానికంగా త‌మ‌కు న‌చ్చిన నేత‌లనే అంద‌ల‌మెక్కించాడు.

ఎల్లుండి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జ‌రుగుతాయి. ఎనిమిదిన జెడ్పీ చైర్మన్ ఎన్నికలు ఉంటాయి. అఖండ విజ‌యంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జ‌రుపుకుంటున్నాయి.