వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం : వివేకానంద‌రెడ్డి కన్నుమూత‌

0
70

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇవాళ తెల్ల‌వారు జామున గుండెపోటుతో మృతి చెందారు. క‌డ‌ప జిల్లా పులివెందుల‌లోని ఆయ‌న నివాసంలో ఈ రోజు తెల్ల‌వారు జామున ఆయ‌న తుదిశ్వాస విడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

వైఎస్ వివేకానంద‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం..

వైఎస్ వివేకానంద‌రెడ్డి 1950 ఆగ‌స్టు 8న క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో జ‌న్మించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్రిక‌ల్చర్ నుంచి వ్య‌వ‌సాయంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వైఎస్ వివేకానంద‌రెడ్డి వైఎస్ఆర్ సోద‌రుడిగా ఆయ‌న‌కు రాజ‌కీయంగా అండ‌గా ఉన్నారు. 1989 – 1994లో క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించారు. 1999 – 2004లో క‌డ‌ప ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించారు. 2004 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌డ‌ప స్థానం నుంచి ల‌క్షా 10 వేల మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఏపీ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన వివేకానంద‌రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2011లో క‌డ‌ప‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వ‌దిన వైఎస్ విజ‌య‌మ్మ‌పై పోటీచేసి ఓడిపోయారు.