టీకాంగ్రెస్ మొత్తాన్ని మింగేశారు

0
64

టీకాంగ్రెస్ నేత‌లకు దిమ్మ‌తిరిగిపోయే ప‌నిచేశారు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం మొత్తాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో క‌లిపేసుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి వినతిపత్రం ఇవ్వ‌డంతో తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష‌హోదా కోల్పోయింది.

తెలంగాణ స్పీక‌ర్‌ విలీనంపై నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇక తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఆరుగురు సభ్యులే. టీ అసెంబ్లీలో ఇప్పుడు టీఆర్ఎస్ త‌ర్వాత‌ మజ్లిస్‌కే ఎక్కువమంది సభ్యులుండ‌టం విశేషం.