పాక్ పై జరిగిన మెరుపు దాడులపై సినీ ప్రముఖుల హర్షం.. ఎవడు కొడితే..!

0
304
పాక్ పై జరిగిన మెరుపు దాడులపై సినీ ప్రముఖుల హర్షం.. ఎవడు కొడితే..!
పాక్ పై జరిగిన మెరుపు దాడులపై సినీ ప్రముఖుల హర్షం.. ఎవడు కొడితే..!

ఈరోజు ఉదయం లేవగానే భారత ప్రజలు మంచి శుభవార్త విన్నారు.. భారత వైమానిక దళం, ఎల్‌ఓసీ దాటి మెరుపు దాడులు చేపట్టింది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మెరుపు దాడులు చేపట్టి ఈరోజు ఉగ్రస్థావరాలను “భారత వైమానిక దళం” ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు తెలుగు సినీ ప్రముఖలు భారత్‌ చేపట్టిన మెరుపుదాడులపై ఆనందం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా ఈ దాడిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు..

వారిలో మొదటగా మంచు విష్ణు స్పందించరని తెలుస్తుంది.. “జై హింద్‌.. ఈ మెరుపు దాడుల వార్త నిజమేనని ఆశిస్తున్నా” ట్వీట్ చేశాడు మంచు విష్ణు. “ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్‌ అయిపోతాయో వాళ్లే మన సైనికులు” అంటూ నటుడు “బ్రహ్మాజీ” సినిమా స్టైల్లో తన అభిప్రాయాన్ని తెలిపాడు. అలాగే రచయిత కోన వెంకట్‌ కూడా “మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు” అంటూ పాక్ కి ధీటుగా వార్నింగ్ ఇచ్చాడు.

“భారత వైమానిక దళాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ మెగా పవర్ స్టార్ “రామ్‌ చరణ్‌” స్పందించగా, “బుల్లెట్‌ దిగిందా లేదా…” అంటూ తనదైన స్టైల్లో స్పందించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. “చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం.. భారత వైమానిక దళానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ భారత సైనికులను ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే “దేశం సరైన సమాధానం చెప్పింది” అంటూ జూనియర్ ఎన్‌టి‌ఆర్ కూడా తన సంతోషాన్ని ట్వీట్టర్ వేదికగా బయటపెట్టడు.