డ్రగ్స్ కేసులో ఏ ఒక్కరిని వదలము.. ఎక్సైజ్ ఆఫీసర్స్

0
235
tollywood drugs case

టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్ర‌గ్స్ కేసు తిరిగి తెరకెక్కింది. రెండు సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీ లో కొంత మంది ప్రముఖుల మీద నమోదు కాబడిన డ్రగ్స్ కేసు యొక్క దర్యాప్తు ఇప్పటికి కొనసాగుతుంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆఫీసర్స్ డ్ర‌గ్స్ కేసు యొక్క సంబదితులైన 62 మంది హీరో, హీరోయిన్ల లో ఏ ఒక్కరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. 2017 లో సినీ రంగంలో ప్ర‌ముఖుల నుంచి గోర్ల‌ను, వెంట్రుక‌ల న‌మూనాల‌ను సేక‌రించగా .. ఇప్పుడు వారి ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయి. ఇప్పటివరకు డ్రగ్స్ కేసు పరంగా 7 ఛార్జిషీట్లు దాఖలు చేశాము. మరో 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు.  డ్రగ్స్ కేసు తో సంబంధం ఉన్న ఎవ్వరిని వదలమని తెలిపారు.