ఇక‌పై పిల్ల‌ల‌కూ ట్యాగింగ్‌..!

0
177

తిరుమ‌ల‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి క‌థ సుఖాంత‌మైంది. కిడ్నాప‌ర్ల‌ను గుర్తించిన పోలీసులు వారి నుంచి బాలుడ్ని ర‌క్షించి తిరుప‌తికి తీసుకొచ్చారు. అనంత‌రం కిడ్నాప్‌కు గురైన బాలుడు వీరేశ్‌ను పోలీసులు త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన వ్య‌క్తి నిజామాబాద్‌కు చెందిన విశ్వంగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు నెల్లూరు జిల్లా క్వారీల్లో ప‌నిచేస్తున్న విశ్వంబ‌ర్ అవివాహితుడు కావ‌డంతో తోడుకోసం బాలుడ్ని కిడ్నాఫ్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌పై స్పందించిన ఎస్పీ అంబురాజు తిరుమ‌ల‌లో పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇక‌పై తిరుమ‌ల‌కు త‌ల్లిదండ్రులు తీసుకొచ్చే పిల్ల‌ల‌కు ట్యాగింగ్ అమ‌ర్చ‌నున్న‌ట్టు ఎస్పీ అంబురాజు చెప్పారు.