బ్రేకింగ్ న్యూస్ : AP ఓటర్ల కోసం 3 ప్రత్యేక రైళ్లు – రైల్వేశాఖ ప్రకటన

0
113
బ్రేకింగ్ న్యూస్ : AP ఓటర్ల కోసం 3 ప్రత్యేక రైళ్లు - రైల్వేశాఖ ప్రకటన
బ్రేకింగ్ న్యూస్ : AP ఓటర్ల కోసం 3 ప్రత్యేక రైళ్లు - రైల్వేశాఖ ప్రకటన

రేపు జగరనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా తమ తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరబాద్ RTC బస్సు స్టాండ్ లు రద్దీగా మారాయి. ఇక ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల క్రితమే ప్రయాణికులు ప్రవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇదిలాఉంటే ఈరోజు అనుకోకుండా కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తమ బస్సులను రద్దు చేశాయి.

దాంతో టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా కొందరు ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దాంతో చేసేదిలేక కొందరు రైలు టికెట్ బుక్ చేసుకోని జనరల్ బోగీల్లో ఎలాగోలా వెళ్లిపోతున్నారు. అయితే రైళ్లలో కూడా నిలబడేందుకు సైతం చోటు దొరక్క పోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంచారం రైల్వేశాఖ దృష్టికి రావడంతో సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైళ్లను వేసినట్టు ప్రకటించింది రైల్వేశాఖ.

రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈరోజు సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు.. రాత్రి 7:20 గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును వేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. ఇవేకాక రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు కూడా ఒక ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు వెల్లడించింది.