లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు : దూసుకెళ్లిన HDFC

0
124
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు : దూసుకెళ్లిన HDFC
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు : దూసుకెళ్లిన HDFC

ఈరోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలను కొనసాగించాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్లు పెరిగి.. 37,752 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 11,345 వద్ద ముగిశాయి. మరీ ముఖ్యంగా బ్లూచిప్‌ షేర్లు దూసుకెళ్లడంతో మార్కెట్‌ ముందుకు కదిలింది. ఇదిలాఉంటే HDFC, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు నేటి మార్కెట్లో బాగా లభపడ్డాయి. నిఫ్టీలో మాత్రం లోహ రంగ సూచీలు బాగా నష్టపోయాయి.

HDFC బ్యాంక్‌ షేర్‌ అయితే జీవితకాల గరిష్ఠానికి చేరింది. నేడు 2.4శాతం పెరిగి రూ.2,223 వద్దకు చేరుకుంది. మరో ప్రధాన షేరు ఇండియన్‌ హోటల్స్‌ కూడా జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. స్పైస్‌ జెట్‌ షేరు 5శాతం కుంగింది. బోయింగ్‌ 737మాక్స్‌ 8 విమానాలపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు నిషేధం విధిస్తుండటంతో షేరు పడి పోయింది.