భ‌ద్రాద్రి రామ‌య్య బ్ర‌హ్మోత్స‌వాల్లో నేడు..

0
257

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టిగా విరాజిల్లుతోన్న భ‌ద్రాచ‌లం శ్రీ సీతారామచంద్ర‌స్వామి వారి దేవ‌స్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి వ‌సంత‌ప‌క్ష ప్ర‌యుక్త శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త మూడు రోజుల నుంచి ప్రారంభ‌మైన ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను తిల‌కించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. శ్రీ సీతారామస్వామి వారి స‌న్నిధానంలో మొక్కుల‌ను తీర్చుకుంటున్నారు.

వ‌సంత‌ప‌క్ష ప్ర‌యుక్త శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాలు సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లం ఆల‌యంలో నేడు ఉత్స‌వ అంకురారోప‌ణం, తిరువీధిసేవ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. స్వామివారి తిరువీధిసేవ‌లో పాల్గొనేందుకు భ‌క్తులు ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో ఆల‌యానికి చేరుకున్నారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య అధికారులు వ‌స‌తులు క‌ల్పించ‌డంతోపాటు అన్న‌దాన కార్యక్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు.