బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ రోజే ..!

0
72
narendra modi

ఈ మధ్యే రాజస్థాన్ లో ఓడిపోయిన.. సార్వత్రిక ఎన్నికలలో గొప్ప విజయాన్ని అందుకున్న ఆనందంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈరోజు సాయంత్రం నిర్వహించనుంది. మోదీ అధ్యక్షతన జరగపోవు సమావేశం సాయంత్రం ఐదున్నర గంటల కు నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి బీజేపీ అధిక సీట్లను సాధిస్తుండటం… వెస్ట్ బెంగాల్‌, ఒడిషా లో ఘన విజయము సాధించడం మీద భారతీయ జనతా పార్టీ వర్గాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

కొన్ని నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో రాజస్థాన్‌లో బీజేపీ ఓటమిపాలయ్యింది. ప్రస్తుతం అక్కడ ఊహించని ఫలితాలు వస్తుండటంతో పార్టీ వర్గాల వారు ఆనందంగా ఉన్నారు. అదే విధంగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ స్టేట్స్ లో కూడా బీజేపీ వెనుకంజ వేసింది. ప్రెసెంట్ అక్కడ కూడా జోరు కొనసాగుతుంది. ఇక దక్షిణాదిలో మునుపటి తో పోలిస్తే భారీగా ఫలితాలలో దూసుకెళ్తుంది.