టిక్ టాక్ సెల‌బ్రెటి హ‌త్య‌.. శ‌రీరంలోకి 13తూటాలు

0
132

ఢిల్లీ టిక్ టాక్ సెల‌బ్రెటి మోహిత్‌ మోర్‌(24) దారుణ హత్య‌కు గుర‌య్యాడు. ముగ్గురు దుండగులు ఆయ‌న‌పై తుపాకీతో 13 రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌లో మోహిత్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

నజఫ్‌గఢ్‌ ప్రాంతంలో మోహిత్‌ ఓ ఫొటో స్టూడియోకు వెళ్లి.. ఆ షాపులోని సోఫాలో కూర్చుండ‌గా ఈ హ‌త్య జ‌రిగింది. బైక్‌పై వచ్చి మోహిత్‌పై కాల్పులు జరిపిన దృశ్యాలు అక్క‌డున్న‌ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఇద్దరు దుండగులు హెల్మెట్‌ ధరించగా, మరో వ్యక్తి ముఖం మాత్రం ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ద్వారకా మోర్‌ మెట్రో స్టేషన్ ద‌గ్గ‌ర‌ ఇద్దరు క్రిమినల్స్‌ హత్యకు గురైన త‌ర్వాత మోహిత్‌ హత్యకు గురికావడం విశేషం.