పాపం త్రివిక్రమ్ కి ఎన్ని కష్టాలో..!

0
209
Thrivikram facing so many problems

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా రేజులే అయింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ థర్డ్ మూవీ అల్లు అరవింద్, చిన్నబాబు భారీగా నిర్మిస్తున్నారనే ప్రకటన వచ్చి కానీ, ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు.

అరవింద సమేతతో జూనియర్ ఎన్టీఆర్కి మంచి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఫేవరేట్ హీరోతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడోనని బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ, పంచ్ మాస్టర్ మాత్రం ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమాకు స్టోరీ సిద్ధం చేయలేదని తెలుస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమా సంక్రాంతికి లాంచ్ అవుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ, అప్పటికి స్టోరీ సిద్ధం అవకపోవడంతో లాంచింగ్ను ఫిబ్రవరికి వాయిదా వేశారని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ కు వచ్చినా సినిమా లాంచింగ్ పై క్లారిటీ రాకపోవడానికి కథ సమస్యలే కారణమని సినీ విశ్లేషకులు అంటున్నారు.