ఇది కుటుంబ కుట్రల చిత్రం

0
92

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ వాలెంటెన్స్ డే సందర్బగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ , లక్ష్మి పార్వతిల ప్రేమ పెళ్లిని ఇతివృతంగా తీసుకోని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కుటుంబ కుట్రల చిత్రమనే ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది.ఈ చిత్రానికి సంబంధిచిన ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను వాలెంటెన్స్ డే సందర్బగా ఈ నెల 14 తేదీన ఉదయం 9 గంటల 27 నిమిషాల కు వర్మ విడుదల చేయబోతున్నట్టు ఈ విషాన్ని తెలియజేస్తూ, రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందనేంది ట్రైలర్ లో వర్మ చూపించ బోతున్నట్టు తెలుస్తుంది.