ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మృతి..!

0
76

నైజీరియా బోర్నోలో జ‌రిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 30 మందికిపైగా మ‌ర‌ణించారు. మ‌రో 40 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ ఏడాది జ‌రిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇంత భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ‌టం ఇదే తొలిసారి. అయితే, ఈ దాడికి తామే బాధ్య‌త వ‌హిస్తున్నామంటూ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మిటిలెంట్ సంస్థ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బోర్నో రాష్ట్రంలోని ప్ర‌జ‌లు, సైన్యాన్ని ల‌క్ష్యంగా చేసుకుని బోకోహ‌రం ఉగ్ర‌వాద గ్రూప్, ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ‌లు ప‌లుమార్లు నైజీరియాలో దాడుల‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే.