మామా, భర్త ఇద్ద‌రూ క‌లిసి..

0
36

వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు ఓ వివాహిత బ‌లైపోయింది. అద‌న‌పు క‌ట్నం తేలేద‌ని వేధించ‌డంతో.. వేధింపులు తాళ‌లేక త‌నువు చాలించింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల‌ జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది.

ఇక సంఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలిలా ఉన్నాయి.. పై ఫోటోలో క‌నిపిస్తున్న ఈమె పేరు పూజిత‌. హైద‌రాబాద్ రెహ్మ‌త్‌న‌గ‌ర్ వీడియోగ‌ల్లీలో నివాసం ఉండే సంతోష్ గుప్తాతో పెళ్లి జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో లాంచ‌నాల‌న్నీ ఘ‌నంగా జ‌రిగాయి. సంతోష్ గుప్తా, పూజిత‌ల కాపురం కొన్నాళ్ల‌పాటు స‌జావుగానే సాగింది.

ఇటీవ‌ల పూజిత‌కు అత్తింటిలో వేధింపులు ఎక్కువ‌య్యాయి. అయితే, అత్తామామ‌ల‌తోపాటు భ‌ర్త సంతోష్ కూడా వేధించిన‌ట్టు తెలుస్తోంది. శారీర‌కంగా, మాన‌సికంగా వేధించ‌డంతో ఆమె కుంగిపోయిన‌ట్టు చెబుతున్నారు. దీంతో ఆ వేధింపులు తాళ‌లేక పూజిత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణం విడిచింది.

అయితే, అత్తింటి వారే త‌మ కూతురు పూజిత‌ను హ‌త్య‌చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని మృతురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. పూజిత కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంత‌కీ పూజిత‌ది హ‌త్య‌నా..? లేక ఆత్మ‌హ‌త్య‌నా..? అనేది పోస్టుమార్టం నివేదిక వ‌చ్చిన త‌రువాత‌నే తెలియ‌నుంది. అది చూశాకే త‌రువాతి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు.