పులివెందుల‌కు వెళ్లిన మ‌రుస‌టి రోజే ఇలా జ‌రిగింది..!

0
155

ఎన్నిక‌ల వేళ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో ఇవాళ తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. అయితే, ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గన్ నివాసంలో ఉంటూ పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్న వైఎస్ వివేకానంద‌రెడ్డి గురువారం నాడు పులివెందుల వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారం చేసేందుకు వెళ్లారు.

హుటాహుటిన పులివెందుల‌కు వైఎస్ జ‌గ‌న్ కుటుంబం..

గురువారం రాత్రి వ‌ర‌కు ఆరోగ్యంగానే ఉన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి శుక్ర‌వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందిన‌ట్టు స‌మాచారం. వివేకానంద‌రెడ్డి మృతితో వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నిటిని ర‌ద్దు చేసుకున్న వైఎస్ జ‌గ‌న్ కుటుంబం పులివెందుల‌కు బ‌య‌ల్దేరారు.

వైఎస్ వివేకాంద‌రెడ్డి మృతిపై అనుమానాలెన్నో..

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇవాళ తెల్ల‌వారు జామున గుండెపోటుతో మృతి చెందారు. అయితే, వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంపై ఆయ‌న పీఏ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. మృతి చెందిన వైఎస్ వివేకానంద‌రెడ్డి త‌ల‌కు గాయ‌మై ఉండ‌టంతో కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వివేకానంద‌రెడ్డిది అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి భౌతిక‌కాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు.

ఇవాళ తెల్ల‌వారుజామున వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతి చెందిన విష‌యాన్ని గుర్తించిన త‌రువాత ఆయ‌న మంచం ద‌గ్గ‌ర, బాత్‌రూమ్‌లో కూడా రక్తం ఉండ‌టాన్ని గ‌మ‌నించాని పీఏ కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు స‌మాచారం. అంతేకాక‌, వివేకానంద‌రెడ్డి త‌న మంచం ద‌గ్గ‌ర కానీ, లేక బాత్‌రూమ్‌లోకానీ బ్ల‌డ్ వాంతింగ్ చేసుకున్న‌డా..? లేక గుండెపోటు వ‌చ్చిందా..? లేక మ‌రేమైనా జ‌రిగిందా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మ‌రోప‌క్క త‌ల‌కు గాయమై ఉండ‌టంతో పోలీసులు కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.