మంత్రి అచ్చెన్నాయుడు జ‌స్ట్ మిస్..! వైసీపీ ఫ్లెక్సీ ప‌డీ..?

0
346

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్మిక‌శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌తో తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న‌లో మంత్రి అచ్చెన్నాయుడు తృటిలో త‌ప్పించుకోగా అధికార టీడీపీకి చెందిన న‌లుగురు కార్య‌క‌ర్త‌లు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.. బుధ‌వారం నాడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు స‌భ నిర్వ‌హించిన ఇచ్చాపురంలో ఇవాళ కింజార‌పు అచ్చెన్నాయుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో క‌లిసి భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు.

ర్యాలీలో భాగంగా మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు ప్ర‌త్యేక కాన్వాయ్‌లో ఇచ్చాపురంలోకి ప్ర‌వేశించ‌గానే వైసీపీ భారీ బ‌హిరంగ స‌భ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కింద ప‌డింది. అది కూడా మంత్రి కాన్వాయ్‌పైనే ఆ ఫ్లెక్సీ ప‌డింది. ఈ ప్ర‌మాదంలో మంత్రి అచ్చెన్నాయుడు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గా, త‌న ప‌క్క‌నున్న మ‌రో న‌లుగురు కార్య‌క‌ర్త‌లకు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దీంతో ఆ న‌లుగురి కార్య‌క‌ర్త‌ల‌కు చికిత్స నిమిత్తం వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.