ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానం టేకాఫ్.. ప్ర‌త్యేక‌త‌లివే..!

http://www.sumantv.com/the-largest-aircraft-take-off/

0
211

ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానం గాల్లోకి ఎగిరింది. కాలిఫోర్నియా ఎడారిప్రాంతంలో ఉండే ముజాబే విమానాశ్ర‌యం నుంచి తొలిసారిగా టేకాఫ్ అయింది. ఈ విమానం రెక్క‌ల పొడ‌వు 117 మీట‌ర్లు.. ఇక బ‌రువు 2 లక్ష‌లా 26 వేల 800 కేజీలు, ఈ విమానం చూసేందుకు రెండు విమానాల‌ను క‌లిపి జాయింట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంది. భూమికి 17వేల అడుగుల ఎత్తులో దాదాపు గంట‌కు 304 కి.మీ వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. స్ట్రాటోలాంచ్ అనే సంస్థ ఈ విమానాన్ని త‌యారు చేసింది.

ఆరు ఇంజ‌న్‌లు, రెండు విమాన బాడీలు ఉండే ఈ విమానం గ‌రిష్టంగా 35వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అయితే, ఈ విమానం ఎగ‌రాలంటే మామూలు విమానాశ్ర‌యాలు స‌రిపోవు. ఎందుకంటే ఇది ఎక‌రాల‌కంటే అతి పొడ‌వైన, వెడ‌ల్పైన ర‌న్‌వే అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఈ విమానం ప్రయోగ‌ద‌శ‌లోనే ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. మ‌రిన్ని అనుమ‌తుల త‌రువాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.గాల్లో నుంచి నేరుగా రాకెట్‌ల‌ను ప్ర‌యోగించి ఉప గ్ర‌హాల‌ను క‌క్ష‌లోకి ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న‌తో ఈ విమానాన్ని రూపొందించిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.