నీట మునిగిన బల్ల కట్టు.. ప్రమాదంలో 20మంది ప్రయాణికులు..!

0
186

కృష్ణ నదిలో నీటమునిగిన బల్లకట్టు. ఆ ప్రమాద సమయంలో బల్లకట్టు పై 20మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బల్లకట్టు మునిగిపోవడంతో లారీ, మరో వాహనం కొట్టుకుపోయాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు బల్లకట్టు నీటమునిగిన ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకుండా అందరు బతికి బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..

బల్లకట్టు అంటే పడవ మాదిరిగానే ఉంటుంది. కానీ పడవకు కొంచం భిన్నంగా ఉంటుంది. దీనిపైనా పెద్ద పెద్ద వాహనాలను, సరకులను తరలిస్తారు. నదులు దాటించాడనికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పుట్ల గూడెం నుంచి రామన్నపేట వైపు బల్లకట్టు వెళ్తుంది. ఆ సమయంలో బల్లకట్టు పై లారీ, కారు ఇతర వాహనాలను కూడా తరలిస్తుండగా, ప్రమాదంచోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో బల్లకట్టుపై 20మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఒడ్డుకు దగ్గర లో నీట మునగింది. దీంతో అక్కడి స్థానికులు నీట మునిగిన 20 మంది ప్రయాణికులను కాపాడారు. ప్రయాణికులంతా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. బల్లకట్టు పై ఉన్న లారీ, నాలుగు ఆటోలు, టాక్టర్లు నీటిలో మునిగిపోయాయి.