హిందువుల‌పై దాడి ఉద్దేశ‌పూర్వ‌క‌మే..!

0
86

ఇటీవ‌ల కాలంలో హిందువుల‌పై దాడులు అధిక మ‌య్యాయి.. ఆ దాడులన్నీ ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వే.. ముఖ్యంగా తెలంగాణ‌లోని హిందువుల‌కు భ‌ద్ర‌త క‌రువైంది.. అయినా చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించాల్సిన అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు.., కాదు.. కాదు వారి ముందే హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

కాగా, ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించారు. హిందువులపై ఉద్దేశ‌పూర్వ‌కంగా దాడులు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వాలు, పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. మొన్న‌టికి మొన్న సాయిసాగ‌ర్ అనే వ్య‌క్తిపై దాడి జ‌రిగింద‌ని, దాడిచేసింది నేర చ‌రిత్ర క‌లిగిన వ్య‌క్త‌ని, ఆ వ్య‌క్తిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.