తెలంగాణ‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తి అరెస్ట్..!

0
186

తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావును కించ‌ప‌రుస్తూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన యువ‌కుడిని హైద‌రాబాద్ రాచ‌కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, యువ‌కుడి అరెస్టుకు సంబంధించి పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన త‌గ‌రం న‌వీన్ అనే డిగ్రీ విద్యార్థి త‌న మిత్రుల‌త క‌లిసి తిరువూరులో పార్టీ చేసుకున్న సంద‌ర్భంగా ఆ వీడియోను రికార్డు చేసి పెట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఆ విష‌యాన్ని త‌మ విచార‌ణ‌లో న‌వీన్ ఒప్పుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

అయితే, ఇదే విష‌య‌మై సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదిక‌గా ఎవ‌రు వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. న‌వీన్ పోస్టు చేసిన వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై, మ‌రికొంత మంది ప్ర‌ముఖులపై చాలా అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలాన్ని వాడార‌ని, రెచ్చ‌గొట్టే విదంగా ఆ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్నారు. చాలా మంది ప్ర‌జ‌లు బాధ‌ప‌డి త‌న‌కు ఆ వీడియోను పంపించార‌ని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కృష్నా జిల్లా తిరువూరు మ‌దిరా రోడ్డు వ‌ద్ద ఉన్న న‌వీన్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.