ఆ పచ్చ మీడియాను కోర్టుకీడుస్తా : డీఎల్ ర‌వీంద్ర‌

0
261

మ‌చ్చ‌లేని జీవిత రాజ‌కీయ ఉన్న త‌న‌పై ప‌చ్చ మీడియా దుష్ప్ర‌చారం చేస్తుంద‌ని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత డీఎల్ ర‌వీంద్ర‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై త‌ప్పుడు రాత‌లు రాస్తున్న ఆ ప‌చ్చ మీడియా యాజ‌మాన్యాన్ని కోర్టుకు లాగుతాన‌ని, వారిపై ప‌రువున‌ష్ట దావా వేస్తాన‌ని డీఎల్ ర‌వీంద్రారెడ్డి హెచ్చ‌రించారు.

తాను తెలుగుదేశం పార్టీకి ఓటెయ్య‌మ‌ని చెప్పిన‌ట్టు ఓ ప‌చ్చ‌మీడియా ప‌త్రిక‌లో ప్ర‌చురించింద‌ని, అది అవాస్త‌వ క‌థ‌న‌మ‌ని డీఎల్ ర‌వీంద్ర ఖండించారు. ప‌చ్చ‌మీడియా ప‌త్రిక‌ల‌న్నీ పాంప్లెట్స్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న త‌న‌పై ఇటువంటి దుష్ప్ర‌చారం చేస్తున్న ప‌చ్చ‌మీడియాపై చ‌ర్య‌లు తీసుకునేందుకు హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని డీఎల్ ర‌వీంద్ర తెలిపారు.