‘దట్ ఐస్ మహా లక్ష్మీ’ అనిపించింది …తమన్నా ( మూవీ రివ్యూ )

0
103
that is mahalakshmi movie review
that is mahalakshmi movie review(2019)

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయకురాలిగా నటించిన  సినిమా ‘ దట్ ఐస్ మహా లక్ష్మీ ‘. ఈ సినిమా ను బాలీవుడ్ లో ‘క్వీన్’ పేరు మీదుగా తీయగా కంగనా రనౌత్ హీరోయిన్గా నటించి భారీ హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వేర్వేరు పేర్లతో , వేర్వేరు హీరోయిన్స్ తో రీమేక్ తీశారు. టాలీవుడ్ లో తమన్నా, కోలీవుడ్ లో కాజల్, మాలీవుడ్ లో మంజిమా మోహన్, శాండిల్ వుడ్ లో పరుల్ యాదవ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మీ’, కన్నడలో ‘బటర్ ఫ్లై’, తమిళంలో ‘పారిస్ పారిస్’, మలయాళంలో ‘జామ్ జామ్’ టైటిల్తో ఈ సినిమా ఈరోజు తెరకెక్కించారు.

కథలోకి వెళ్తే ..

ఒక పల్లెటూరు, సాంప్రదాయ కుటుంబం లో పెరిగిన అమ్మాయి గా తమన్నా మహాలక్ష్మి పాత్రలో నటించింది. తమన్నా కు అబ్రాడ్ అబ్బాయితో పెళ్లి కుదురుతుంది.. ఎంగేజ్మెంట్ జరిగి కుటుంబమంతా ఆనందములో ఉంటారు. ఆ సమయంలో తమన్నాను పిలచి హీరో పెళ్లి చేసుకోలేనని , అబ్రాడ్ కల్చర్ కి అలవాటై పోయానని చెప్తాడు. ఎంతో డిస్సపాయింట్ తో ఉన్న తమన్నా కుటుంబంతో కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లి తర్వాత హనీమూన్ పారిస్ పంపాలని నిర్ణయించుకుంటారు కుటుంబం. పెళ్లి క్యాన్సల్ బాధలో ఉన్న తమన్నా హామిమూన్ కి ఒక్కతే వెళ్లాలని కుటుంబాన్నంతా ఒప్పించి వెళ్తుంది. అమాయకురాలైనా తమన్నా పల్లెటూరు నుండి పారిస్ వరకు వెళ్తుంది. ఇక్కడినుండి కథ ఒక మలుపు తిరుగుతుంది.

పారిస్ వెళ్లినా మహాలక్ష్మి ఒక హోటల్ ఉండగా అక్కడ విజయలక్ష్మి పాత్రలోనటించిన శుభాని దండెకర్ పరిచయమవుతుంది. విజయ్ లక్ష్మితో కలిసి మొత్తం పారిస్ ను చుట్టేస్తోంది. పారిస్ లో కూడా మన సంప్రదాయాన్ని , ప్రాంత విశిష్టతను తెలియచేస్తూ కామేడీ ని తలపించేలా చేసింది తమన్నా. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారి , అక్కడి దుస్తులు ధరించడం మోడర్న్ అమ్మాయిగా మారిపోతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు .. అక్కడ ఎదుర్కొన్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇండియా కి తిరిగి రావడం.. ఆ సమయంలో విజయలక్ష్మీ సెండ్ ఆఫ్ బావోద్వేగాయానికి గురి ఆయ్యే సీన్ అందరిని ఆకర్శించింది. తమన్నా ఇండియా కు తిరిగి వచ్చాక హీరో తన తప్పును తాను తెలుసుకొని పెళ్లి చేసుకుంటాడా ?తమన్నా అంగీకరిస్తుందా లేదా తెరపైనే చూడాలి.

నటన పరంగా :

తమన్నా నటన అందరిని ఆకర్సింది కానీ పల్లెటూరు అమ్మాయి పాత్రలో సరైన విధంగా సెట్ కాలేదు సనిపించింది. నటన భావోద్వేగ పరంగా అద్భుతంగా నటించింది. ఈమెకు తోడుగా పరిచయమైనా విజయలక్ష్మి (శుభాని దండెకర్ ) నటన తన పాత్రకు తగ్గట్టుగా పోషించింది.

సాంకేతిక పరంగా :

ఈ సినిమాలో పారీస్ ను అక్కడి ప్రదేశాలను బాగా చూపించారు. మ్యూజిక్ బాగుందని చెప్పక తప్పదు.

బలం:

ఈ సినిమాకు కథ బలం అని చెప్పవచ్చు.

Review: 3/5