కేర‌ళ‌లో ఉద్రిక్త‌త‌..ఒకరు మృతి, 60 బస్సులు ధ్వంసం.!

0
228

కేరళలో నిన్న ఉదయం కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళాలు శబరిమల ఆలయంలోకి ప్రవేశము నిరసిస్తూ నిన్న హిందూ సంఘాలు ఇచ్చిన బందు పిలుపు కేరళలో హింసాత్మకంగా మారుతుంది. ఓ వైపు సిపిఎం కార్యాలయం పై దాడులకు దిగుతున్నా ఆందోళన కారులు మరో వైపు బస్సు లను ధ్వంసం చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన చెంద్రన్ అనే వ్యక్తి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చనిపోయారు.

మరో వైపు ఆలయంలో శుద్ధి నిర్వహించిన అర్చకుడి పై సుప్రీం కోర్టు లో కేరళ కు చెందినా ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసాడు. అంతే కాదు కేరళలో బందు నేపథ్యంలో పలు చోట్ల నిరసనలు చెలరేగుతున్నాయి. దింతో తమిళనాడు సర్కార్ సరిహదులను మూసివేసింది. తమిళనాడు కు చెందిన వాహనాలు నిత్యం వేలాదిగా కేరళకు వెళ్తుంటాయి. కేరళలో జరుగుతున్నా నిరసనల కారణంగా ఆస్థి నష్టం జగరాదు అనే ఆలోచన తోనే వాహనాలు ఆపేసినట్టు అధికారులు తెలిపారు. అయితే కేరళ లో పరిస్థితు లు చక్కపడ్డాక వాహనాలు పంపుతాము అంటున్నారు తమిళనాడు అధికారులు పలు చోట్లా బీజేపీ హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా దాదాపు 60 బస్సు లకు పైగా ధ్వంసం అయ్యాయి.