ఈ గ‌వ‌ర్న‌ర్ చాలా రేర్ గురూ..

0
148

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఈఎస్ఎల్‌ న‌ర‌సింహ‌న్ ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రేపు అరుదైన ఘనత సాధించబోతున్నారు. గ‌వ‌ర్న‌ర్ గా ఎక్కువమంది ముఖ్య‌మంత్రుల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ అరుదైన రికార్డు అందుకోబోతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఆయన హయాంలో నాలుగు ప్రభుత్వాలు ఏర్పడగా.. ఏపీలో రేపు (గురువారం) వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఐదో ప్రభుత్వం ఏర్పడనుంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ నుంచి కిరణ్‌ కుమార్ రెడ్డి (2010), రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో (2014) ఒకసారి..

తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (2014, 2018) రెండుసార్లు న‌ర‌సింహ‌న్‌ ప్రమాణ స్వీకారాలు చేయించారు. రేపు జగన్‌ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయితే నలుగురు వ్యక్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన అరుదైన ఘనత గవర్నర్‌ నరసింహన్‌కు దక్కనుంది.