తెలంగాణ జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు డేట్ ఫిక్స్‌..?

0
82

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నెల 22 నుంచి మే 14వ తేదీ వ‌ర‌కు జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతూ ఎన్నిక‌ల సంఘానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు పంపింది. ఈ విష‌య‌మై సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో
సీఎం కేసీఆర్ శుక్ర‌వారం స‌మీక్షించారు.

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఆయా తేదీలను ఈసీకి ప్ర‌తిపాదించారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 32 జిల్లాల‌కు చెందిన 535 జ‌డ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్‌లు ప్ర‌క‌టించేశారు.