నిజామాబాద్‌ పోలింగ్‌ చరిత్రలో నిలిచిపోతుంది : రజత్‌ కుమార్‌

0
119
నిజామాబాద్‌ పోలింగ్‌ చరిత్రలో నిలిచిపోతుంది : రజత్‌ కుమార్‌
నిజామాబాద్‌ పోలింగ్‌ చరిత్రలో నిలిచిపోతుంది : రజత్‌ కుమార్‌

ఎన్నికల విధి విదానలపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడాడు… ఎన్నికల చట్ట ఉల్లంఘనపై ఇప్పటి వరకు 300లకు పైగా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు రూ.29 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు రజత్ కుమార్.

మరీ ముఖ్యంగా నిజామాబాద్‌ ఎన్నిక కోసం 1789 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని.. ఈ పోలింగ్‌ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. ఈవీఎంల పరిశీలనకు 600 మంది ఇంజినీర్లు ఇప్పటికే సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే చెల్లింపు వార్తలపై ఇప్పటికే 600 వరకు ఫిర్యాదులు అందాయన్న ఆయన.. పోలింగ్‌ను సీసీటీవీ కెమెరాల మద్య జరపబోతున్నాం అని చెప్పారు.

7వ తేదీ రాత్రికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తామని.. 8,9 తేదీల్లో ఏయే పోలింగ్‌ కేంద్రాలకు ఎన్ని సర్దుబాటు చేయాలనే దానిపై కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత 10వ తేదీ సాయంత్రానికి ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాలకు చేరుస్తామని.. పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ప్రతి జాగ్రత్త తీసుకుంటాం అని సీఈవో రజత్‌ కుమార్‌ వివరించారు.