‘అయోగ్య’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

0
211

యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన సినిమా టెంపర్‌. ఈ సినిమాకు డైరెక్టర్ గా పూరి జగన్నాథ్‌ చేశారు. ఎన్టీఆర్‌, పూరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్‌ హిట్ సాధించింది. ఎన్టీఆర్‌లోని నటనను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌లో ‘సింబాగా’ సత్తా చాటింది. ఇక కోలీవుడ్‌లోనూ సందడి చేయడానికి సిద్ధం అవుతుంది టెంపర్‌. ఇక హీరో ఎవరా అని చూడగా మాస్ పరంగా , మంచి ఫేమ్ తెచ్చుకున్న కోలీవుడ్ లో నటుడు విశాల్‌ ఈ సినిమాకు సరైన వాడుగా గుర్తించారు. అందుకే ఈ సినిమాలో విశాల్ నటిస్తున్నాడు.

లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘అయోగ్య’ పేరు ఖరారు చేశారు. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించగా, విశాల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. విశాల్ సరసన కథనాయకురాలిగా రాశీఖన్నా నటిస్తుంది. అలాగే  ఓ ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణం పనులు పూర్తికానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కూడా ప్రారంభించేయాలని చిత్రయూనిట్‌ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే రిలీజ్‌ కాబడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ ప్రేక్షకులనుండి వచ్చింది. ఇక తాజాగా చిత్రయూనిట్‌ సినిమా టీజర్‌ రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నెల ఫిబ్రవరి ఆరున టీజర్‌ రిలీజ్‌ కాబోతుంది.