ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. పాఠ‌శాల గ‌దిలో..!

0
220

విద్యాబుద్దులు నేర్పించి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించేలా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే రాక్ష‌సుడి అవ‌తార‌మెత్తాడు. విద్య‌ను అభ్య‌సించేందుకు వ‌చ్చిన బాలిక‌పై తన కీచ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఇంత జ‌రుగుతున్నా విష‌యం తెలిసిన స‌హ ఉపాధ్యాయులు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు ప్ర‌శ్నించిన త‌ల్లిదండ్రుల‌కు స‌ర్దిచెప్పేందుకు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

విద్యాలోకం త‌ల‌దించుకునే ఈ సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా అర్ధ‌వీడులో చోటు చేసుకుంది. 48 ఏళ్ల వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి అలియాస్ గోపిరెడ్డి అనే ఉపాధ్యాయుడు ఒక‌టో త‌ర‌గతి చ‌దువుతున్న ఆరేళ్ల బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు వెంక‌టేశ్వ‌ర‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై ఫోక్సో చ‌ట్టం కింద న‌మోదు చేశారు. టీచ‌ర్ గోపిరెడ్డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మార్కాపురం ఇన్‌స్పెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు తెలిపారు.