పార్లమెంట్ సాక్షిగా కేంద్రంపై గర్జించిన : రామ్మోహన్ నాయుడు

0
98

సోమవారం ఉదయం నుండి చంద్రబాబు నాయుడు డిల్లీలో చేస్తున్న “ధర్మపోరాట దీక్ష” విజయవంతం అయ్యింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఊహించని రీతిలో ఈ సభకు ఆధారణ లపించింది. మోధి ప్రభుత్వాన్ని గద్దె దించమే లక్ష్యంగా దేశం మొత్తం ఒక్కటయ్యిందా ? అనిపించింది. దాంతో TDP నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

బాబు చేసే ఈ దీక్ష ఎంత నిజాయితీగా చేసిన, AP ప్రజలు మాత్రం బాబు కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి, తన ముఖ్యమంత్రి పదవి చేజారుతుందేమో అన్న భయం పట్టుకొనే బాబు ఇలాంటి దీక్షలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఏం చేసిన చివరికి ఆంద్ర రాష్ట్రనికి న్యాయం జరగాలి. ప్రత్యేక హోదా రావాలి అనే అందరి ఆశ. ఆ ఆశలకు ప్రాణం పోశారు MP రామ్మోహన్ నాయుడు.

అవును ఇన్నటివరకు “గల్లా జయదేవ్” లాంటి వాళ్ళే తమ పార్లమెంట్ లో తమ గొంతు వినిపించారు. ఇదివరకు ఇతర MPలు కూడా తమ గొంతు వినిపించిన, వారి స్పీచ్ కి పెద్దగా ఆధారన లబించాలేదు.. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ MP “రామ్మోహన్ నాయుడు” కేంద్రాన్ని ప్రశ్నించిన తీరు యావత్ దేశాన్ని రంజింప చేసింది. ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా మోసం చేశారో క్లుప్తంగా వివరించారు రామ్మోహన్ నాయుడు.

అతడి వాదన వింటుంటే కేవలం చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాష్ట్రనికి రావాల్సిన నిధులని కేంద్రం ఆపేసిందని స్పష్టంగా అర్దం అవుతుంది. పైగా ఈమద్య ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకుంది కేంద్రం. దీనిపై స్పందించిన రామ్మోహన్ నాయుడు.. ఇంత నీచమైన రాజకీయం ఏనాడూ చూడలేదని ఎద్దేవా చేశాడు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు తీరుకు తెలుగు ప్రజలనుండి ప్రశంసలు అందుతున్నాయి.