శాస‌న స‌భ‌లో క‌నిపించ‌రు.. గుర్తుపెట్టుకోండి : సీఎం జ‌గ‌న్‌

0
118

ఏపీ బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ వాళ్ల బ‌ట్ట‌లు ఊడ‌బ‌డుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తుంటే త‌ట్టుకోలేక, జీర్ణించుకోలేక ర‌కర‌కాల బాధ‌ల‌ను వెలిబుచ్చుతున్నారంటూ ప్ర‌తిప‌క్ష స‌భ్యుల ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో పెద్ద దుమార‌మే రేగింది.