వినుకొండ టీడీపీ అభ్య‌ర్ధి సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
750

2009, 2014లో వినుకొండ టీడీపీ నేత ఆంజనేయులు ఎమ్మెల్యేగా విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. 2009లో 24 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించిన ఆంజ‌నేయులు 2014లో 21వేల ఓట్ల మెజార్టీని సాధించారు. అంతేకాకుండా, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యం సాధించి త‌న స‌త్తా ఏంటో మ‌రోమారు చూపిస్తానంటూ ఆంజ‌నేయులు ధీమాగా చెబుతున్నారు.

వినుకొండ‌లో వైసీపీ గాలి బ‌లంగా వీచినా త‌న‌కు వాటిల్లే న‌ష్ట‌మేమీ లేద‌ని టీడీపీ అభ్య‌ర్ధి ఆంజ‌నేయులు చెబుతున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో 21 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది కాబ‌ట్టి, ఈ సారి ఏమైనా తేడా కొట్టినా మెజార్టీ తగ్గ‌డం త‌ప్పా, పెద్ద‌గా త‌న విజ‌యంపై ప్ర‌భావం చూపే అవ‌కాశ‌మేమీ లేద‌ని ఆంజ‌నేయులు చెబుతున్నారు.