వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు..!

0
416

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య దుందుబి మోగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర‌ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జ‌గ‌న్ పేరు మారుమోగుతోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు కూడా జై వైసీపీ, జై జ‌గ‌న్ అంటూ నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు.

అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 కాగా, వైసీపీ 151 నియోజ‌క‌వ‌ర్గాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 22 స్థానాల‌ను వైసీపీ గెలుపొందింది. దీంతో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎక్కువ పార్ల‌మెంట్ స్థానాల‌ను గెలుపొందిన రాజ‌కీయ పార్టీల్లో తృతీయ స్థానంలో ఉంది.

ఇదిలా ఉండ‌గా, టీడీపీ టికెట్‌పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారనున్నారంటూ ప‌లు క‌థ‌నాలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. ఆ 23 మందిలో కొంద‌రు వైసీపీ వైపు చూస్తున్నార‌ని, మిగిలిన వారు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ ఆ క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.