చంద్ర‌బాబు టికెట్ కేటాయించినా.. నో చెప్పి వైసీపీలో చేరిన టీడీపీ ముఖ్య నేత‌..!

0
291

తెలుగుదేశం పార్టీ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి కొద్ది సేప‌టి క్రితం ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నెల్లూరు రూర‌ల్ టికెట్‌ను కూడా క‌న్ఫామ్ చేసింది. అయినా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

 

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల లోట‌స్‌పాండ్‌లోని జ‌గ‌న్ నివాసానికి చేరుకున్న ఆదాల‌ను వైసీపీ ముఖ్య నేత‌లు ఆహ్వానించారు. అనంత‌రం వారు ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి వైసీపీ కండువాక‌ప్పిన వైఎస్ జ‌గ‌న్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, మాజీ మంత్రి వంగా గీత కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆదాల‌తోపాటే వంగా గీత‌ను కూడా జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారు.