లోకేశ్ కు తెలుగు రాకపోవచ్చు కానీ : సినీనటి దివ్యవాణి

0
357
లోకేశ్ కు తెలుగు రాకపోవచ్చు కానీ : సినీనటి దివ్యవాణి
లోకేశ్ కు తెలుగు రాకపోవచ్చు కానీ : సినీనటి దివ్యవాణి

ఆంధ్రప్రదేశ్ IT మంత్రి నారా లోకేశ్ ప్రసంగంలో ఎన్ని తప్పులు దొర్లుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రసంగంలో ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడే పొరపాట్లను ట్రోలింగ్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు నెటిజన్స్. అలాంటి నెటిజన్స్ కి భారీ కౌంటర్ ఇచ్చింది సినీనటి, AP టీడీపీ అధికార ప్రతినిధి “దివ్యవాణి”.

గతంలో లోకేశ్ తన చదువు నిమిత్తం విదేశాల్లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. తెలుగులో కొంచెం అటూ ఇటూగా లోకేశ్ మాట్లాడని తప్పుబట్టడం.. ఆ విషయాన్ని పెద్దది చేసి చూపడం సరైన పద్ధతి కాదని ఆమె వివరణ ఇచ్చారు. లోకేశ్ కు తెలుగు రాకపోవచ్చు కానీ, ఆయన చెప్పే మాటల్లో భావనను అర్థం చేసుకోలేని అమాయకులు కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నారు దివ్యవాణి.

అలాగే లోకేశ్ బాబు చాలా జ్ఞానం కల్గిన వ్యక్తి అని, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఎలా ముందుకెళ్లాలన్న విషయం ఆయనతో ఉన్న వాళ్లకు తెలుస్తుందని చెప్పారు. ఇటు ఐటీ రంగంలో కానీ, అటు గ్రామీణంలో కానీ లోకేశ్ తన ఆలోచనలతో ఎంతలా అభివృద్ధి చేశారో కళ్ళారా చూస్తున్నామని “దివ్యవాణి”, లోకేశ్ ని ఆకాశానికి ఎత్తేసింది.