వంగ‌లపూడి అనిత – తెలుగు త‌మ్ముళ్ల‌కు కొత్త టెన్ష‌న్‌..!

0
242

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు, చింత‌ల‌పూడి, తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాలు తెలుగుదేశం పార్టీలో హాట్ హాట్ చ‌ర్చ‌కు తెర లేపాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌క ర‌కాల కార‌ణాల‌తో టీడీపీ అభ్య‌ర్ధుల ఎంపిక‌, మార్పు జ‌రిగింది. అయితే, జ‌రిగిన మార్పులు, తీసుకున్న నిర్ణ‌యాలు ఎన్నిక‌ల్లో పోటీచేసిన అభ్య‌ర్ధుల‌ను గెలిపించే విధంగా ఉన్నాయా..? లేవా..? అన్న ప్ర‌శ్న‌లు పార్టీ కేడర్‌లో గుబులు రేపుతున్నాయి.

అయితే, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి జ‌వ‌హ‌ర్ నుంచి ప్రాతినిద్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, జ‌వ‌హ‌ర్ అంద‌ర్ని క‌లుపుకుపోవ‌డంతో ఆయ‌న్ను తప్పించాలంటూ పెండ్యాల అచ్చిబాబు వ‌ర్గం ఎన్నిక‌ల‌కు ముందు బ‌లంగానే డిమాండ్ చేసింది.

దీంతో మంత్రి జ‌వ‌హ‌ర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు టీడీపీ అధిష్టానం మార్చింది. జ‌వ‌హ‌ర్ ప్లేస్‌లో వంగ‌ల‌పూడి అనిత‌ను బ‌రిలోకి దింపింది. అయితే, అభ్య‌ర్ధి మార్పు వ్య‌వ‌హారంతో టీడీపీ గెలుపుకు కొంద‌రు ప‌నిచేయ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇదే విష‌యాన్ని పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌మీక్షా స‌మావేశాల్లో కూడా ప్ర‌స్తావించ‌డం నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వంగ‌ల‌పూడి అనిత బాగా మాట్లాడ‌తార‌ని, అందుకే ఆమెకు కొవ్వూరు నుంచి అవ‌కాశం క‌ల్పిస్తే కొంద‌రు అబ్బందులు సృష్టించార‌ని చంద్ర‌బాబు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డంతో ఫ‌లితాల త‌రువాత చోటు చేసుకోనున్న ప‌రిణామాల‌పై టీడీపీ శ్రేణులు దృష్టి సారించారు.