టీడీపీకి మ‌రో ఎదురుదెబ్బ‌..!

0
207

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న అంబికా కృష్ణ సాయంత్రం బీజేపీలో చేర‌నున్నారు. అయితే, టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఫిల్మ్ డెవెల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా అంబికా కృష్ణ ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, అంబికా కృష్ణ ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి 1999 నుంచి 2004 వ‌ర‌కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు. వైశ్యా సామాజిక‌వర్గానికి చెందిన అంబికా కృష్ణ టీడీపీలో కీల‌క నేత‌గా ఉంటూ ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించారు.