చంద్ర‌బాబుకు హ్యాండిచ్చిన కుమార‌స్వామి..!

0
351

ఆదివారం సాయంత్రం ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు విడుద‌ల చేసిన ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల్లో కేంద్రంలో మ‌ళ్లీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం రాబోతుంద‌ని స్ప‌ష్ట‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో జాతీయ స్థాయి ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌సారిగా జావ‌గారిపోయాయ‌న్న కామెంట్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇలా అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు రావ‌డంతో దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో ఒక్క‌సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి.

ఇదిలా ఉండ‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాసేప‌టి క్రితం 21 పార్టీల అధినేత‌ల‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామిని కూడా పిల‌వ‌డం జ‌రిగింది. అయితే, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీలు కుట్ర‌లు ప‌న్నుతున్నాయ‌ని, ఆ క్ర‌మంలోనే ఎమ్మెల్యేల‌ను కొనేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతుందని చెప్ప‌డంతో కాంగ్రెస్ ఆయ‌న్ను ఇప్పుడు ఢిల్లీకి రావాల్సిన అస‌వ‌రం లేద‌ని చెప్పింది. దాంతో కుమార స్వామి చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన స‌మావేశానికి హాజ‌రుకాలేక‌పోయారని స‌మాచారం.